600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన రోబో సీక్వల్ మూవీ 2.ఓ వచ్చిన ముందు చెప్పినట్టుగానే 60 నిమిషాల్లోనే ఆన్ లైన్ లో లీక్ చేశారు తమిళ్ రాకర్స్. ఈరోజు రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆన్ లైన్ లో హెచ్.డి ప్రింట్ లీక్ అయ్యింది. ఇది కచ్చితంగా తమిళ్ రాకర్స్ పనే అని అంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందే దర్శక నిర్మాతలను ఛీంజ్ చేస్తూ సినిమా రిలీజ్ నాడే ఆన్ లైన్ లో పెట్టేస్తామని వారు బెదిరించారు.
ఈ విషయంపై తమిళ్ రాకర్స్ మీద కేసు వేసినా ఫలితం లేకుండాపోయింది. చెప్పినట్టుగానే 2.ఓ హెచ్.డి ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. అయితే 3డి టెక్నాలజీతో వచ్చిన సినిమా కాబట్టి లీక్ చేసిన సినిమా క్వాలిటీ అంతగా లేదు. మొత్తానికి తమిళ్ రాకర్స్ ఇచ్చిన షాక్ కు 2.ఓ టీం కు చెమటలు పట్టేశాయి. ఇక సినిమా విషయానికొస్తే రోబో అంచలానకు తగినట్టుగానే 2.ఓ ఉన్నా ఎక్కడో చిన్న అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది.
విజువల్స్ పరంగా మాత్రం సినిమా ది బెస్ట్ అనిపిస్తుంది. అయితే కథ విషయంలో శంకర్ కాస్త కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ గా 2.ఓ అంచనాలకు తగిన సినిమాగా సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది.