దేశ వ్యాప్తంగా కమలం జోరు..ఉప ఎన్నికల్లో బీజేపీ దూకుడు..!

-

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిస్తుంది..మొత్తం దేశం వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది..బీహార్‌ ఎన్నికలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది..సర్వే అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ కూటమి గెలుపు దిశగా దూసుకకెళ్తుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఒక్కసారిగా వాడీవేడి చర్చ జరుగుతోంది.. బీహార్‌లోని 243 స్థానాలతోపాటు మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలు, గుజరాత్‌లో 8 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ స్థానాలు, మరో 8 రాష్ట్రాల్లో కలిసి 15 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుంది.బీహార్‌లో ఎన్డీఏ, ఆర్జేడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్ర ఫలితంపై దేశవ్యాప్తంగా ప్రజలు సర్వత్రా ఆసక్తిగాఎదురుచూస్తున్నారు..మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది నిర్దేశించనున్నాయి..9 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం 19 స్థానాల్లో బీజీపీ ఆధిక్యంతో కొనసాగుతుండగా..కాంగ్రెస్‌ కేవలం 9 స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది..మరోవైపు యూపీలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 93 మంది బరిలో ఉన్నారు. హత్రాస్‌ ఘటన నేపథ్యంలో ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి..ఇక దక్షిణాదిలో కర్ణాటకలో రెండు స్థానాలకు, తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతుంది..కర్ణాటకలో రెండు స్థానాలకే ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు అవి అగ్నిపరీక్షగా పరిణమించాయి..బీజేపీకి ఝలక్‌ ఇవ్వాలంటే ఈ రెండు స్థానాల్లోనూ తప్పనిసరిగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది..నాగాలాండ్‌లో ఒకటి, ఒడిశాలో టిర్టోల్, బాలాసోర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news