తమిళ నాట స్టార్ స్టేటస్ ఉన్న సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ కొన్ని రోజులుగా సూర్య సినిమాలకి తెలుగులో డిమాండ్ తగ్గుతూ వచ్చింది. గ్యాంగ్ సినిమా నుండి మొదలు పెడితే సింగం 3, బందోబస్త్ చిత్రాలు తెలుగులో ఫ్లాప్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో సూర్యకి మార్కెట్ కూడా బాగా తగ్గింది. ఐతే తాజాగా సూర్య నుండి ఆకాశం నీ హద్దురా సినిమా వచ్చింది. కరోనా టైమ్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీ ఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని ఎమొషన్స్ తో కలిపి అందరినీ ఆకట్టుకుంటుంది. నటన పరంగా సూర్యకి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమా నుండి మంచి స్పందన రావడంతో సినిమా హిట్ అని అర్థం అవుతుంది. ఐతే ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఆకాశం నీ హద్దురా థియేటర్లలో రిలీజై ఉంటే సూర్యకి చాలా ప్లస్ అయ్యేది. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించింది.