జీహెచ్ఎంసి ఎన్నికల ముంగిట హైదరాబాద్ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2020-21లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తున్నట్లు ఆఉయ్న ఈరోజు ప్రకటించారు. 15 వేల రూపాయల వరకు ఆస్తి పన్ను కట్టిన వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పన్ను రాయితీతో జీహెచ్ఎంసీ పరిధిలోని 13.72 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని ఆయన అన్నారు.
అలాగే, 40 పట్టణాల్లోనూ ఆస్తి పన్నులో రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించారు కేటీఆర్. ఇతర పట్టణాల్లో 10 వేల రూపాయల లోపు ఆస్తి పన్ను కట్టేవారికి కూడా 50 శాతం రాయితీ కల్పించడానికి సిద్దమయింది ప్రభుత్వం. దీపావళి కానుకగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇక అంతకు ముందు ఆయన తన సహచర మంత్రులు కొందరితో సీఎస్ తో చాలా సేపు సమావేశం అయ్యారు.