విశాఖలో పెను ప్రమాదం తప్పింది. యారడా బీచ్ కి వెళ్లి ముగ్గురు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. యారడా తీరంలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. ఆదివారం ఆటవిడుపుగా యారడాకు వచ్చిన ఏడుగురు యువకులు… అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో చిక్కుకున్నారు. నగరానికి చెందిన కొండ నవీన్(20) భీశెట్టి యశ్వంత్(20) కె.శ్రవణ్(20) చిక్కుకున్నారు.
మిగిలిన మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు… చర్యలు చేపట్టారు. పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు దిగారు. యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగం… చివరకు విజయవంతం అయింది. ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యువకులను గజ ఈతగాళ్ళు రక్షించారు. దీనితో అక్కడ ఉన్న వారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.