నవ్వితేనే మీకు గోరు ముద్దలు పెడుతుంది..!

-

feeding arm in australia

అవును.. మీరు నవ్వాలి. నవ్వితేనే మీకు భోజనం. లేదంటే మీరు కడుపు మాడ్చుకోవాల్సిందే. మొహం మాడ్చుకుంటే ఫుడ్డు ఉండదు. అందుకే మీరు నవ్వాల్సిందే. ఇంతకీ ఏంటి సంగతి అంటారా? మేం మాట్లాడేది ఫీడింగ్ ఆర్మ్ గురించి. అంటే రోబోటిక్ చెయ్యి అన్నమాట. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. చాతికి దీన్ని సెట్ చేసుకోవాలి. టేబుల్ కు ఎదురెదురు కూర్చోవాలి. చాతికి దీన్ని సెట్ చేసుకున్నవాళ్లకు ఎదురుగా ఉన్నవ్యక్తులకు ఇది గోరు ముద్దలు తినిపిస్తుంది. కాకపోతే ఎదురుగా కూర్చున్నవాళ్లు తమ ముఖంలో చిరునవ్వు చిందించాలి. అలా అయితేనే అది వాళ్లకు గోరు మద్దలు తినిపిస్తుందన్నమాట. దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా అయిపోయిందట. పలు రెస్టారెంట్లలో దీన్ని ఇకముందు వాడుతారట. ఎవరైనా వెరైటీగా వేరే వాళ్లు తినిపిస్తే తినాలనుకున్నవాళ్లకు గానీ.. పిల్లలకు గానీ ఈ ఫీడింగ్ ఆర్మ్ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news