అత్యుత్సాహం ఎందుకు…సుప్రీం

-

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలను రాత్రికి రాత్రే ఎందుకు సెలవుపై పంపించారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీబీఐ చీఫ్‌పై ఇలాంటి నిర్ణయం తీసుకునేప్పుడు సెలక్షన్‌ కమిటీని ఎందుకు సంప్రదించకుండా అత్యుత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ ప్రశ్నించారు. గత కొన్ని నెలలుగా ఘర్షణ పడుతుండటంతో సీబీఐ బాహాటంగా అపహాస్యం పాలైందని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అకారణంగా  ఆలోక్‌ వర్మ తనను కేంద్రం సెలవుపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి…ఈ క్రమంలో సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. సీబీఐ అంశంపై సీవీసీ దర్యాప్తు చేపట్టిందని, కానీ ఆలోక్‌ వర్మ కొన్ని నెలల పాటు సంబంధిత దస్త్రాలు ఇవ్వలేదని సీవీసీ కోర్టుకు వెల్లడించింది. అంతర్గత కలహాలుంటే వాటిని సంస్థ పరువు పోయే విధంగా మీరు ఆపాదించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news