శిల్పా ఫ్యామిలీతో కోమటిరెడ్డి వియ్యం..

-

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికర వివాహం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన శిల్పా కుటుంబంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వియ్యం అందుకున్నారు. శిల్పా సోదరుల్లో ఒకరయిన ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రణవ్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి వివాహం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది.

కోవిడ్‌ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్‌ వేదికగా ఈ పెళ్లి జరిగింది. ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శిల్పా మోహన్ రెడ్డి తో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో ఆయన సోదరుడి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news