నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్ర తుఫానుగా మారి ప్రస్తుతం అంతకంతకూ తీవ్రతరం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బెంబేలెత్తిపోతున్నారు. నివర్ తుఫాను దూసుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఇటీవలే ఏకంగా తమిళనాడులో రేపు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
ప్రస్తుతం కలర్ వరకు 180 కిలోమీటర్లు పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను… 11 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీంతో మరికొన్ని గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో… రేపు తమిళనాడు వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.