చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్హ అందించింది. సరుకు రవాణా ఛార్జీలను ఆర్టీసీ తగ్గించింది. చిన్న వ్యాపారస్తులు.. రైతులను దృష్టిలో పెట్టుకుని సరుకు రవాణా ఛార్జీల్లో సవరణలు చేసినట్టు చెబుతున్నారు. వంద కిలో మీటర్లు లోపల చేసుకునే సరుకు రవాణా ఛార్జీలను 50 శాతం వరకు సవరించింది ఆర్టీసీ.
ఇకపై వంద కిలోమీటర్ల లోపల చేసుకునే సరుకు రవాణాకు ఒక టన్నుకు రూ. 1000 వసూలుకు నిర్ణయం తీసుకుంది. 500 కిలోల మేర సరుకు రవాణాకు రూ. 500 ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. కనీస లోడు 3 టన్నులుంటే ప్రత్యేక వాహానం కేటాయించనుంది ఆర్టీసీ. ప్రత్యేక వాహానం కేటాయింపునకు ప్రత్యేక ఛార్జీలు.. టోల్ రుసుం, జీఎస్టీ ఛార్జీలను వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది.