ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు.. మన బాధ్యత. అవును.. మనం ఓటు వేయనప్పుడుఎవరినీ ప్రశ్నించలేం. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు మనకు వస్తుంది. కానీ.. నేటిసమాజంలో చాలా మంది నేనొక్కడిని ఓటేయకపోతే ఏమౌతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు.చాలామంది ఓటింగ్ రోజును సెలవు దినంగా భావించి ఓటేయడానికి వదిలేస్తున్నారు. కానీ..వీళ్లు చూడండి.. కేవలం ఓటేయడం కోసం… అవును.. కేవలం ఓటేయడం కోసమే ఆస్ట్రేలియా,అమెరికా, సౌత్ ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చారు.
మనం హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్నఊరికి వెళ్లి ఓటేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తాం. కానీ.. చాలా మంది ఈసారి విదేశాలనుంచి వచ్చి మరీ ఓటేశారు. అందులో హైదరాబాద్ కు చెందిన సత్యప్రకాశ్, మరో వ్యక్తిభరత్ కుమార్ కేవలం ఓటేయడం కోసమే యూఎస్ నుంచి తెలంగాణకు వచ్చారు. మరో వైపుఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఆశ్రిత అనే యువతి నిజామాబాద్ కు వచ్చి తన తొలి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆశ్రిత సిడ్నీలో ఉన్నత చదువులు చదువుతోంది. సౌత్ఆఫ్రికా నుంచి సరిత అనే యువతి కూడా హైదరాబాద్ కు వచ్చి తన ఓటు హక్కునువినియోగించుకుంది.