గాడిద పాలు బంగారమే లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్..!?

-

ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది.. ఇది పాత మాట. గాడిద పాలు తాగితే అనారోగ్యం దరిచేరదు.. ఇది నేటి మాట. నెల్లూరు జిల్లాలోని మనుబోలు లోను గాడిద పాల విక్రయం జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లాలోని మంచిర్యాల కి చెందిన 20 కుటుంబాలు మనుబోలు మండలం లోని పలు గ్రామాల్లో గాడిద పాలు ను విక్రయిస్తున్నారు. ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఎంత ఖరీదైనా సరే జనం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

donkey milk
donkey milk

గెదె పాలు… ఆవు పాలు మరి గాడిద పాల గురించి విన్నారు. గాడిద పాలు అనగానే ముఖాలు అదోలా పెట్టడం ఖాయం. వినేందుకు అదోలా ఉన్నా ఇప్పుడు ఆ పాలకున్న డిమాండ్ వింటే మాత్రం విస్తుపోవాల్సిందే. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గాడిద పాల విక్రయం జోరుగా సాగుతోంది. గాడిద పాలు ఆరోగ్యానికి మేలని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరగడంతో జనం వీటి రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలకు గాడిద పాలు పట్టిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకాన్ని కలిగిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయన్న ప్రచారం జరుగుతోంది.

మండలంలోనూ గాడిద పాల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల చందాన సాగుతోంది. ఖాళీ జండూబామ్ సీసాలో పట్టే పాల ధర ఎంతో తెలుసా?… అక్షరాలా రూ.50. పెద్దలకు చిన్న స్టీల్ గిన్నెడు పాలు రూ.100 అంటే నమ్ముతారా?… అంతేసి ధరలు పెట్టి కూడా సామాన్య జనం ఆ పాలను కొనేందుకు ఎగబడుతున్నారు. 5యం యల్ పాలు ధర 50 రూపాయలు అంటే లీటర్ 10 వేలు ధర పలుకు తుంది.చిన్నపిల్లలకు వచ్చే ఆయాసం, ఉబ్బసం, నిమ్ము, దగ్గు, తదితర వ్యాధులకు ఈ పాలు వాడిన వారి దరిచేరవని గాడిద పాల విక్రయదారులు చెబుతున్నారు.

ఇవి తాగితే పెద్దవారిలో గురక, తలపోటు, కడుపులో మంట, నీరసం, ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయట. నెల్లూరు జిల్లాలోని తదితర ప్రాంతాల్లో ఊరూరా విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. సీజనల్ వ్యాధులతో అల్లాడిపోతున్న చిన్నారులకు ఈ పాలను పట్టించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news