మేజర్ అయిన తర్వాత ఒక యువతి యువకుడు ఒక ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేయడాన్ని సభ్యసమాజం తప్పు పడుతున్నప్పటికీ… కోర్టులు మాత్రం సమర్థిస్తూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే ఇక ఇటీవల మరోసారి అలహాబాద్ కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది మేజర్ అయిన తర్వాత ఒక యువతి యువకుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం చేయడం వారి హక్కు అంటూ వారి స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు తల్లిదండ్రులకే కాదు ఎవరికీ ఉండదు అంటూ తేల్చి చెప్పింది అలహాబాద్ కోర్టు.
ఇటీవలే కామిని దేవి అజయ్ అనే ఇద్దరు సహజీవనం చేస్తున్న జంట అలహాబాద్ కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే ఇలా సహజీవనం చేస్తున్న వారిని వేధింపులకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం తప్పదు అంటూ హెచ్చరించింది అలహాబాద్ కోర్టు. అంతేకాకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సహజీవనం చేస్తున్న జంటకు పోలీసులు రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.