జిహెచ్ఎంసి ఫలితాలపై ఆయన దే తుది నిర్ణయం..!

-

జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో వాతావరణం హాట్ హాట్ గా మారిపోయింది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి జిహెచ్ఎంసి పరిధిలో ఓట్ల లెక్కింపు మొదలు అవుతున్న నేపథ్యంలో… ఇక అన్ని పార్టీల అభ్యర్థుల్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 150 డివిజన్లను సంబంధించిన ఓట్ల లెక్కింపు గాను 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించారు….

ఒక్కొక్క కౌంటింగ్ హాల్ కి ఒక రిటర్నింగ్ అధికారి తో పాటు పరిశీలకుడు కూడా ఉంటారు అని తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక ఏజెంట్ ఉండేందుకు అవకాశం కల్పించింది అయితే ఇలా కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉండాలనుకునే వారు ముందుగా పాసులు తీసుకోవాలి అంటూ సూచించింది అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను నిషేధించింది. సీసీ కెమెరా ల నిఘాలో ఎన్నికలు కౌంటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది అయితే.. అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు అంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news