అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అమెరికన్లందరికీ ‘ఉచితంగా’ కోవిడ్ -19 వ్యాక్సిన్ ను అందిస్తా అని ఆయన హామీ ఇచ్చారు. ఒక వ్యాక్సిన్ రెడీ అయిన వెంటనే నేను అమెరికన్లకు అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తా అని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ అమెరికన్ కి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తా అని ఆయన హామీ ఇచ్చారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, 24 గంటల్లో 2,10,000 కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి.
కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో… తన వైద్య నిపుణుల బృందానికి నాయకత్వం వహించాలని అంటు వ్యాధి నిపుణుడు ఆంథోనీ ఫౌసీని ఆయన కోరారు. సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బిడెన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఇంతకు ముందు ఫౌసీని కలిశానని, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ పదవిలో కొనసాగాలని ఆయనను కోరినట్టు చెప్పారు.