బిగ్ బ్రేకింగ్ : మా వ్యవహారంలో జోక్యం వద్దంటూ కోర్టుకు వెళ్లనున్న ఎలక్షన్ కమిషన్ !

-

ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశించింది, బీజేపీ నేతలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అలానే పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది హైకోర్టు. అయితే హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్టు చెబుతున్నారు.. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి స్వీకరించాలని విజ్ఞప్తి ఎలక్షన్ కమిషన్ కోరనున్నట్టు చెబుతున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news