వరుసగా మూడోసారి యథాతథ స్థితిని కొనసాగిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 4 శాతంగానే ఉంచింది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీనిపై ప్రకటన చేసారు. పాలసీ రెపో రేటును 4 శాతం నుంచి మార్చకుండా ఉండటానికి ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఏకగ్రీవంగా ఓటు వేసింది.
ఆర్థిక వ్యవస్థపై డిపాజిటర్ల ఆసక్తిని కాపాడటానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉందని, ఆర్థిక మార్కెట్లు క్రమబద్ధమైన పద్ధతిలో పనిచేస్తున్నాయి అని శక్తికాంత దాస్ వెల్లడించారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటు 4.25 శాతంగా మారే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది. 2021 కొరకు జిడిపి వృద్ధి -7.5% వద్ద అంచనా వేయబడింది అని చెప్పారు.