ఏలూరులో పిట్టల్లా రాలుతున్న జనం…. అసలేమైంది?

-

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్న సాయంత్రం కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోవడంతో సర్వత్రా టెన్షన్ మొదలైంది. పదుల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురై, కళ్లు తిరిగి పడిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 60 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వీరిలో 18 మంది పైగా చిన్నారులు ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు కావడంతో నిన్న సాయంత్రం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఏలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. హుటాహుటిన అంబులెన్స్‌లను ఆయా ప్రాంతాలకు పంపించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేట్ హాస్పిటల్ లను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య సిబ్బంది పర్యటించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తోంది. అసలు ఈ ఘటనకు కారణం కల్తీ నీరా ? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news