ఏలూరులో వింత వ్యాధి కాదు..ఆ హెవీ మెటల్ కారణం !

-

ఏలూరులో అస్వస్థకు లెడ్ హెవీ మెటల్ కారణమని తేలింది. ఈ మేరకు పరీక్షల వివరాలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ముందుగా అనుమానినించినట్లే పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా “లెడ్” అనే హెవీ మెటల్, మరియు నికెల్ అనే మెటల్ ఎక్కువుగా వున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీలో పరీక్షల్లో తెలిసిందని ఆయన అన్నారు. లెడ్ ( సీసం) కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయి. “లెడ్” బ్యాటరీస్ లో ఉండే పదార్ధం. ఇది తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.

సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగిందన్న జీవీఎల్ వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలని కోరారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోందని ఆయన అన్నారు. మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని ఆయన అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news