ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా దేని గురించి వెతికారంటే?

-

Google Reveals The Uplifting Word That The World Searched For In 2018

గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువగా దేని గురించి వెతికారో తెలుసా? ఆ పదం మరేదో కాదు గుడ్. గుడ్.. అనే పదంతో ఉన్న వాక్యాలనే యూజర్లు ఎక్కువగా గూగుల్ సెర్చ్‌లో వెతికారట. ఈ విషయాన్ని గూగులే చెప్పింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గూగుల్ రూపొందించిన ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇయర్ ఇన్ సెర్చ్ పేరుతో గూగుల్ ఈ వీడియోను రిలీజ్ చేసింది. గుడ్ పేరుతో ఉన్న వాక్యాలైన గుడ్ థింగ్స్ ఇన్ ది వరల్డ్, హవ్ టూ బీ ఏ గుడ్ సిటిజన్, ఏ గుడ్ సింగర్, ఏ గుడ్ కిస్సర్, వాట్ మేక్స్ ఏ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ రోల్ మోడల్.. ఇలాంటి వాక్యాలనే యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేశారట. ఈ వాక్యాలను బేస్ చేసుకొని గుగుల్ అదిరిపోయే వీడియోను రూపొందించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటూ.. యూట్యూబ్ ఇయర్ ఎండ్ రివైండ్ కన్నా బాగుందంటూ కితాబిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news