ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? వీడియో

-

Zomato food delivery boy eats customer food

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తెలుసు కదా. ఆ యాప్‌కు చెందిన ఓ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ప్రస్తుతం చాలామంది ఫుడ్‌ను ఆర్డర్ చేస్తున్నారు. అయితే.. ఆ ఫుడ్ ఏ రెస్టారెంట్ నుంచి వస్తుంది.. ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ పరిశ్రుభంగా ఉంటుందా లేదా.. డెలివరీ చేసే బాయ్స్ అదే ఫుడ్‌ను డెలివరీ చేస్తారా లేక వేరే ఫుడ్ డెలివరీ చేస్తారా? ఇలా వంద రకాలుగా ఆలోచించాలి. కానీ.. ఎంతమంది ఆలోచిస్తున్నారు.

ఆకలేయగానే స్మార్ట్‌ఫోన్ తీయడం.. యాప్ ఓపెన్ చేయడం.. నచ్చిన ఫుడ్ బుక్ చేయడం. అది రాగానే లొట్టలేసుకుంటూ తినేయడం. మీరు కూడా అదే జాబితాలో ఉన్నారా? అయితే.. ముందు ఈ వీడియో చూడండి. తర్వాత మాట్లాడుకుందాం.

చూశారుగా.. యాక్ అంటారా? ఏంది ఈ డెలివరీ బాయ్ ఇలా కస్టమర్ ఫుడ్‌ను ఎంగిళి చేసి మళ్లీ మంచిగా ప్యాక్ చేసి లోపలపెట్టాడు అంటారా? ఆ వీడియో మీరు చూశారు కాబట్టి అలా అంటున్నారు.. ఒకవేళ చూడకపోతే. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. సినీనటుడు మహేశ్ బాబు భార్య నమ్రత కూడా ఈ వీడియోపై స్పందించింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేసేముందు కాస్త ఆలోచించండి అంటూ హితువు పలికింది.

ఈ ఘటనపై స్పందించిన జొమాటో దానికి కారణమైన ఆ డెలివరీ బాయ్‌ను పనిలో నుంచి తప్పించింది. అతడి తరుపున తన కస్టమర్లందరినీ జొమాటో క్షమించాలంటూ కోరింది. ఫుడ్ ట్యాంపరింగ్ విషయంలో తాము రాజీ పడేది లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news