మగాడి జీవితం పెళ్లికి ముందు పెళ్లి తర్వాత.. ఎఫ్-2 ఫన్ ఫిల్డ్ టీజర్..!

-

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు మిక్స్ చేసి ఈ సినిమా వస్తున్నట్టుగా తెలుస్తుంది.

భార్యా బాధితులుగా వెంకటేష్, వరుణ్ తేజ్ పంచిన కామెడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. వెంకటేష్ కు తమన్నా, వరుణ్ తేజ్ కు మెహ్రీ కౌర్ జోడీ కడుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కామెడీ పంచేందుకు సంక్రాంతికి అళ్లుళ్లుగా మీ ముందుకు ఎఫ్-2 సినిమాతో వస్తున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకోగా సినిమా తప్పకుండా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మెప్పు పొందేలా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news