కొన్ని రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యాకుట్స్ మరియు మగడాన్ నగరాల మధ్య రాకపోకలు నిలిపివేయబడిన ఒక రహదారి పై తన కారు ఆగిపోవడంతో రష్యా డ్రైవర్ మరణించిన ఘటన సంచలనంగా మారింది. 18 ఏళ్ల తన స్నేహితుడు తప్పిపోయిన తరువాత, స్థానిక పోలీసులను ఒక వ్యక్తి ఆశ్రయించాడు. దాదాపు ఒక వారం పాటు శోధించాక ఒక రాకపోకలు నిలిపివేయబడిన ఒక రహదారి మీద అతన్నిమంచుతో కప్పబడి ఉన్న కారులో గుర్తించారు.
అక్కడ కొద్ది రోజులుగా ఉష్ణోగ్రత -50 సెల్సియస్ కు పడి పోయిందని తేలింది. అది ప్రమాదకరమైన మరియు నిషేదించబడిన రహదారి అని స్థానికులు పేర్కొన్నారు. డ్రైవర్ చనిపోయి ఉండగా అతనితో పాటు ఉన్న ప్రయాణీకుడిని ఆసుపత్రికి తరలించి, మంచు దెబ్బకు సంబందించిన చికిత్స చేయించారు, తరువాత వారు ఎలా ఇరుక్కుపోయారో అతను వివరించారు. రెండు నగరాల మధ్య చూపించిన ప్రయాణ సమయం 34 గంటలు. కానీ ఈ ‘రోడ్ ఆఫ్ బోన్స్’ మూడు గంటల తక్కువ సమయం చూపడంతో ఈ రోడ్ లో వెళ్లాలని భావించమని ఆయన చెప్పుకొచ్చాడు.