టాప్ డైరెక్టర్స్ ఇగోలకు బడా బాబులు బుక్ అవుతున్నారా..?

-

ఆ ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు.ఎన్నో ఏళ్ల నుంచి తమ స్టార్ డమ్ కాపాడుకుంటూ వస్తున్నారు.
టైమ్ వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకుంటున్నారు.తాజాగా అలాంటి సమరమే మరోసారి
జరగనుంది.దానికి వచ్చే ఈ సమ్మర్ నే వేదికగా చేసుకుంటున్నారు.ఈ సినిమాల డైరక్టర్ల ఇగో తోనే వీరిద్దరి మధ్య మరో సారి ఫైట్ ఘురూ అయినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్ టాప్ హీరోలలో చిరంజీవి,బాలయ్యల రూటే సెపరేట్ .బాక్సాఫీస్ షేక్ చేయడంలో వీరెప్పుడు ముందు వరుసలోనే ఉంటున్నారు.తాజాగా మరోసారి బాక్సాఫీస్ ను తమ తఢాకా ఏంటో చూపించాలని సరదా పడుతున్నారు.దానిలో భాగంగా ఈ సమ్మర్ ను వేదికగా చేసుకున్నారు.ఐతే ఈ సమరంలో ముందుగా రావడానికి చిరంజీవి తన ఆచార్యను సిద్ధం చేస్తున్నాడు.

చిరంజీవితో కొరటాల తన ఆచార్యను ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు.కథ విషయంలో ఎంతో కసరత్తు చేసి మరీ సెట్స్ మీదకు తీసుకుపోయారు.దీనికి తోడు చెర్రీ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాకు మంచి బిజ్ జరుగుతుంది.కరెక్ట్ గా ఇదే టైమ్ లో బాలయ్య బోయపాటితో ముచ్చటగా మూడోస్సారి వస్తోన్న సినిమా మార్చికి షూట్ పూర్తి చేసుకుని మన ముందుకు రావడానికి రెఢీ అవుతుంది.ఈసినిమాను రిలీజ్ కు సమ్మర్ నే ఎంచుకున్నారు.అందుల్లోను కొరటాలకు పోటీగా బోయపాటి తన సినిమాను వదలాలని డిసైడ్ అయ్యాడు.

ఒక రకంగా పైకి చెప్పుకోవడానికి ఇది చిరంజీవి,బాలయ్యల ఫైటింగ్ మాదిరిగా కనిపించానా..ఇంటర్నల్ గా కొరటాల,బోయపాటిల ఇష్యూ లాగానే కనిపిస్తుందంటున్నారు.ఎప్పటినుంచో ఇగోలతో క్లాష్ అవుతోన్న వీరిద్దరు ఈసారి తమ హీరోల సినిమాలతో ఇలా తమ ఇగోలను శాటిస్ఫై చూసుకోవాలని చూస్తున్నారని పరిశ్రమలో టాక్ అయితే నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news