నేడు బీసీ సంక్రాంతి సభ.. విజయవాడలో భారీ ఎత్తున ఆంక్షలు

-

ఈ రోజు బీసీ సంక్రాంతి కార్యక్రమం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది. కార్పొరేషన్ డైరెక్టర్లు,ఫెడరేషన్ చైర్మన్ ల పదవీ స్వీకారం కార్యక్రమంలో సీఎం జగన్ కూడా  పాల్గొననున్నారు. 56 ఫెడరేషన్ చైర్మన్ లు,672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి  ముఖ్యఅతిధిగా – బీసీల సంక్రాంతి  పేరుతో కార్యక్రమం జరగనుంది. మంత్రులు,ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు,ముఖ్య అధికారులకు గేట్ 2 నుంచి అనుమతి ఉంటుంది, డైరెక్టర్ లు,చైర్మన్ కుటుంబ సభ్యులు ఫుడ్ కోర్ట్ గేట్ 3 నుంచి అనుమతి ఇస్తున్నారు.

గేట్ 2 నుంచి వచ్చే వారికి స్టేడియంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో పార్కింగ్, గేట్ 3 నుంచి వచ్చే వారికి పి డబ్యు డి గ్రౌండ్స్ లో పార్కింగ్ అలాట్ చేశారు. సందర్శకులకు గేట్ 6 నుంచి అనుమతి ఇస్తున్నారు. పాస్ లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉండనుంది. 9.30 కల్లా అందరూ సభాస్థలికి చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బస్టాండ్ నుంచి మచిలీపట్నం, ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్ లు కంట్రోల్ మీదుగా ఏలూరు రోడ్, రామవరప్పాడు రింగ్ మీదుగా మళ్లించనున్నారు. బెంజ్ సర్కిల్ వైపుకు ఆర్టీసీ బస్ లు అనుమతించమని, బందరు రోడ్ లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎటువంటి ఆర్టీసీ సిటీ బస్ సర్వీసులు అనుమతించమని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news