డిజిటల్‌ రంగంలోనూ తపాలాశాఖ..

-

తపాలాశాఖ ఇక డిజిటల్‌ రంగంలోనూ దూసుకవెళ్లనుంది. సెల్‌ఫోన్‌ నుంచే ఇతర ఖాతలకు సులువుగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పేమెంట్, అన్ని రకాల రీచార్జ్, ఎలాక్ట్రిసిటీ బిల్లులు, భీమాలు కట్టవచ్చు. డిజిటల్‌ పేమెంట్‌ (డాక్‌పే) అనే పేరుతో ఓ యాప్‌ను ఆవిష్కరించారు. పేటిఎమ్, ఫోన్‌పే, గూగుల్‌పే మాదిరిగానే డాక్‌పే పని చేస్తోందని తపాలా శాఖ పేర్కొంది.

అన్ని బ్యాంకులకు..

డాక్‌యాప్‌ ద్వారా తపాలా బ్యాంక్‌తో పాటు, ప్రభుత్వ, ప్రవేట్‌ కలిపి 140 బ్యాంక్‌ ఖాతాలకు లింక్‌ చేసుకోవచ్చు. ఏ అకౌంట్‌ నుంచైనా స్నేహితులు, బంధువులు, దుకాణాదారులు, రెస్టారెంట్లలలో నగదు బదిలీ చేసుకోవచ్చు. అందుకోసం యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేజ్‌(యూపీఈ)తో ఒప్పందం కుదుర్చు కుంది. పోస్టాఫీస్‌ సేవింగ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే ఐపీబీపీతో లింక్‌ చేసుకొని ఆ అకౌంట్‌లోని సొమ్మును నగదు బదిలీకి కూడా ఉపయోగించుకోవచ్చని తపాలా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news