చంద్రబాబు గాలి నాయుడు.. పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడు !

-

ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ  ఫేక్ పార్టీ? అన్నారని అసలు టీడీపీ కి జాతీయ గుర్తింపు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అలాంటిది జాతీయ అధ్యక్షుడు అని చెప్పటం ఫేక్ కాదా? అని అయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కుని కబుర్లు చెబుతున్నాడన్న ఆయన కాగితాల మీద ఫేక్ అమరావతిని, గ్రాఫిక్స్ ని సృష్టించాడని అన్నారు. చంద్రబాబు గాలి నాయుడు, కుక్కలా మొరుగుతున్నాడని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి అయినా పట్టు వస్ర్తాలు సమర్పించావా? అని ప్రశ్నించిన ఆయన ఇవాళ తన బినామీలు రోడ్డున పడగానే అమ్మవారం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. నీ కుట్రలు చూసే అమ్మవారు నీకీ స్థితి కల్పించిందని అన్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల నుంచి వెళ్ళకూడదని చంద్రబాబు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో జగన్ కు 170 సీట్లు వస్తాయని అన్నారు. 74 ఏళ్ళు పూర్తి కాగానే చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షోభ పెట్టిన గతే పడుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news