అమ్మాయిలని అర్థం చేసుకోవడంలో మగవాళ్ళు ఆమడ దూరంలో ఉంటారో ఏమో కానీ అబ్జర్వ్ చేయడంలో మాత్రం అంగుళం కూడా వెనక్కి రారు. చాలా విషయాల్లో ఆడవాళ్ళని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. అసలు అలా అబ్జర్వ్ చేస్తున్నట్టు కనీసం వారికి తెలీను తెలీదు. మగవాళ్ళు అబ్జర్వ్ చేసే అత్యంత రహస్య విషయాలేంటో ఈ రోజు తెలుసుకుందాం.
ఆడవాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ని ఎవరు అందుకోలేరని అనుకుంటారు. కానీ అది అబద్ధం. ఆడవాళ్ల ముఖ కవలికల్ని చాలా స్పష్టంగా మగవాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే కాదు వారి పెదవుల బిగింపుని బట్టి కూడా వారెలాంటి మూడ్ లో ఉన్నారో కనిపెడతారు.
ఆమె ఎంచుకునే కలర్
కలర్ మన మూడ్ ని తెలియజేస్తుందని అందరికీ తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ తో బయటకి వచ్చేటపుడు ఆమె వేసుకునే డ్రెస్ కలర్ ని బట్టి ఏ మూడ్ లో ఉందని ఇట్టే కనిపెట్టేస్తారు.
షవర్ సాంగ్..
స్నానం చేస్తున్నప్పుడు పాట పాడే అలవాటున్న వారికి ఇది బాగా వర్తిస్తుంది. పాట పాడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ విషయాన్ని మగవాళ్ళు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు.
మెసెజ్ ద్వారా..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంది. పనులన్నీ ఒక్క మెసేజ్ ద్వారా పూర్తవుతున్నాయి. ఆడవాళ్ళు ఏ విధంగా మెసేజ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి వారి ముడ్ ఎలా ఉంది, వారు స్వార్థపరులా లేదా అని అంచనా వేస్తారు.
ఇంకా అవతలి వారితో మాట్లాడేటపుడు వారి చూపులు, చేష్టలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే దాన్ని చాలా క్లియర్ గా పట్టుకుంటారు.