థియోటర్లను ప్లే గ్రౌండ్స్ లా మారుస్తున్న నిర్మాతలు

-

థియేటర్లు స్టేడియమ్స్‌గా మారిపోతున్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలుపెడితే ముంబాయి వరకు సినిమా హాళ్లన్నింటిని ప్లే గ్రౌండ్స్‌గా మార్చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అంతర్జాతీయ వేదికల్లో భారత జెండాని రెపరెపలాడించిన క్రీడాకారుల కథాంశాలని తెరకెక్కిస్తున్నారు. వెండితెరపై బంగారు పతకాలు సాధించాలనుకుంటున్నారు.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు ఆటగాళ్ల బయోపిక్స్‌ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సైనా నెహ్వాల్, పీవీ సింధు బయోపిక్స్‌ని ప్లాన్‌ చేస్తే ఇప్పుడు చెస్ చాంపియన్ విశ్వనాథ్ ఆనంద్‌ కథని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్‌ ఎల్.రాయ్ దర్శకత్వంలో విశ్వనాథ్‌ సినిమా రాబోతోంది. ఈ మూవీలో ధనుష్‌ లీడ్‌ రోల్‌ ప్లే చేస్తాడని సమాచారం.

ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ కోచ్ పుల్లెల గోపీచంద్‌ లైఫ్ హిస్టరీ కూడా సినిమాగా రాబోతోంది. పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌గా రాబోతోన్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు, బ్యాడ్మింటన్‌ కోచ్‌గా నటించబోతున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్‌ తెరకెక్కుతోంది.

ఆల్రెడీ కపిల్‌ దేవ్ కథతో ’83’ అనే సినిమా వస్తోంది. ఇండియన్ క్రికెట్‌ టీమ్ మొదటిసారి వరల్డ్‌ కప్‌ నెగ్గిన విన్నింగ్‌ మూమెంట్స్‌తో ఈ సినిమాని డిజైన్ చేశారు. రణ్‌వీర్‌ సింగ్‌ కపిల్‌ దేవ్‌ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ సినిమా 2020లోనే రిలీజ్‌ కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news