చిరుని బాగా వాడేస్తున్నాడు

-

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరోగా సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ రీసెంట్ గా టాక్సీవాలా సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమా కూడా మైత్రి మూవీస్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. డియర్ కామ్రెడ్ సినిమా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

అయితే విజయ్ టాలెంట్ మెచ్చిన వారు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్ ఇచ్చారట. ఇక చేయబోయే సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇంతకీ టైటిల్ ఏంటంటే హీరో అని పెట్టబోతున్నారట. హీరో టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి 1984లోనే ఓ సినిమా చేశారు. చిరంజీవి, రాధిక జోడీ కట్టిన ఈ సినిమాను విజయ బాపినీడి డైరెక్ట్ చేయగా అల్లు అరవింద్ నిర్మించారు. మరి చిరు టైటిల్ వాడుతున్నాడు అంటే అందుకు తగిన కంటెంట్ సపోర్ట్ ఉందనే చెప్పుకోవచ్చు.

ఇదే కాకుండా లవర్ బోయ్ నితిన్ కూడా హీరో అంటూ ఓ సినిమా చేశాడు. జివి సుధాకర్ నాయుడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నితిన్ కెరియర్ లో డిజాస్టర్ మూవీగా మిగిలింది. మరి మెగాస్టార్ హీరో రేంజ్ కు విజయ్ దేవరకొండ హీరో మూవీ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news