మెగాస్టార్ మూవీలో చరణ్..!

-

సెట్స్ మీద ఉన్న సైరా సినిమా పూర్తి కాకముందే మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత సినిమా కన్ఫాం చేశారు. కొరటాల శివ డైరక్షన్ లో కొరటాల శివ మూవీ ఉంటుందని తెలుస్తుంది. మాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తారట. అయితే ఈ మూవీలో రాం చరణ్ కూడా ఉంటాడని తెలుస్తుంది. చిరు సినిమాలో చరణ్, చరణ్ సినిమాలో చిరు అలా కెమియో ఇచ్చి మెగా ఫ్యాన్స్ ను అలరించడం కామనే. అది వారికి హిట్ సెంటిమెంట్ కూడా.. అయితే ఈసారి కొరటాల శివ చిరంజీవి సినిమాలో చరణ్ కు ఓ ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నారట.

సినిమాలో చరణ్ ఎంట్రీ అదిరిపోతుందని అంటున్నారు. మెగాస్టార్ మూవీలో రాం చరణ్ అంటేనే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అది కూడా కొరటాల శివ ఇంట్రెస్ట్ పెట్టి మరి రాశాడంటే ఇక అది ఎలా ఉంటుందో మెగా ఫ్యాన్స్ అంచనాలకే వదిలేయొచ్చు. న్యూ ఇయర్ లో మొదలవనున్న ఈ సినిమాలో చిరు సరసన మళ్లీ నయనతార నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా చిరంజీవికి జోడీగా నటిస్తుంది నయనతార. మెగాస్టార్ విత్ మెగా పవర్ స్టార్ ఈ ఇద్దరు కలిసి ఈ టైంలో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news