ఏపీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, బి-ఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు బోధనా రుసుములు నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 నుంచి2022-23 వరకు మూడేళ్లపాటు ఈ బోధన రుసుములు అమల్లో ఉంటాయని అందులో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 240 ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెరైన్ ఇంజనీరింగ్ కళాశాలలకు బోధన రుసుముల ఖరారు అయ్యాయి. ఇంజినీరింగ్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు.. గరిష్టంగా రూ. 70 వేలుగా ఫీజులు అని నిర్ధారించారు. ఐదు కళాశాలలకు అత్యధికంగా రూ. 70 వేలు ఫీజుగా ఖరారు చేశారు. 113 బీఫార్మసీ ప్రైవేట్ కళాశాలలకు కనిష్టంగా రూ. 35 వేలు.. గరిష్టంగా రూ. 65 వేలుగా ఖరారు చేశారు.
అలానే రాష్ట్రంలో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు ప్రభుత్వం ఫీజు ఖరారు చేసింది. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూవైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల ఉత్తర్వులు ఇచ్చారు. 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు ఫీజులను ఖరారు చేసింది ప్రభుత్వం. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు అని ఫిక్స్ చేసింది.
ఇక ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 83 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 1.49 లక్షలు, బీపీటీ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు అని ఫిక్స్ చేసింది. ఎంపీటీ కోర్సుకు- కన్వీనర్ కోటా: రూ. 94 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 1.60 లక్షలు, బీహెచ్ఎంఎస్- కన్వీనర్ కోటా: రూ. 22 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 3 లక్షలు అని ఫిక్స్ చేసింది. బీఎస్సీ-ఎంఎల్టీ కోర్సు- కన్వీనర్ కోటా: రూ. 18 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 80 వేలు, డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులు- కన్వీనర్ కోటా: రూ. 14 వేలు, మేనేజ్మెంట్ కోటా: రూ. 45 వేలు, జీఎన్ఎం కోర్సులు- కన్వీనర్ కోటా: రూ. 15,500, మేనేజ్మెంట్ కోటా: రూ. 72 వేలు గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.