కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టనున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ రోజు మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కాలినడకన రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాష్ట్రపతిని కలవనున్నారు రాహుల్. విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వీరి పాదయాత్ర సాగనుంది. తర్వాత వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన పత్రాలను రాష్ట్రపతికి అందజేయనున్నారు.
గత వారం రాష్ట్రపతి ని కలిసి రైతుల డిమాండ్ పై జోక్యం చేసుకోవాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ తో పాటు, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు అందచేశారు. పార్లమెంట్ లో ఈ మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు కార్మికులు, దేశవ్యాప్తంగా ఇతర సంబంధిత వర్గాల నుంచి సంతకాలు సేకరించిన కాంగ్రెస్ పార్టీ వాటిని రాష్ట్రపతికి అందచేయనున్నారు.