సలార్ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ..

-

ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ తో పాటు మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన సలార్ సినిమాపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా రూపొందడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ సినిమా పనులు వేగవంతం అయ్యాయి. ఈ మద్యే సినిమలో నటించేవారి కోసం ఆడిషన్ కూడా నిర్వహించారు. ఈ ఆడిషన్ కి వేల సంఖ్యలో ఆర్టిస్టులు వచ్చారు.

ఐతే సలార్ సినిమాలో ప్రభాస్ పక్కన నటించేది ఎవరనే విషయమై రకరకాల వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ దిశా పటాని సలార్ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఈ మేరకున్ అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న దిశా పటాని సలార్ సినిమాలో నటిస్తే, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news