కరోనా నేపథ్యంలో మొదట్లో కేవలం 3 లక్షణాలను మాత్రమే కరోనాకు నిర్దారించారు. జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే అవి కరోనా లక్షణాలు అని చెప్పారు. తరువాత ఆ జాబితాలో క్రమంగా ఇతర లక్షణాలు వచ్చి చేరాయి. వాటిల్లో రుచిని కోల్పోవడం కూడా ఒకటి. అయితే కరోనా వచ్చిన వారందరిలో అన్ని లక్షణాలు కనిపించవు. అసలు కొందరికి ఏ లక్షణం ఉండదు. కానీ కరోనా ఉంటుంది. ఇక కొందరికి కరోనా వచ్చాక రుచిని గుర్తించలేరు. కానీ కొందరైతే కరోనా నుంచి కోలుకున్నాక కూడా రుచులను గుర్తించలేకపోతున్నారు. అయితే అలాంటి వారు కాల్చిన నారింజ పండ్లను తింటే రుచులను మళ్లీ గుర్తించగలుగుతారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇంతకీ ఇది నిజమేనా ? అంటే…
కోవిడ్ నుంచి కోలుకున్న కొందరు ఇప్పటికీ రుచులను గుర్తించలేకపోతుండడంతో వారిలో కొంత మంది కాల్చిన నారింజ పండ్లను తింటున్నారు. నారింజ పండ్లను మంటపై కాల్చి అనంతరం వాటిని తింటున్నారు. అయితే కొందరు తామ ఈ ప్రయోగం చేసినా వర్కవుట్ కాలేదని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇలా తినడం వల్ల తాము మళ్లీ రుచులను గుర్తించగలుగుతున్నామని అంటున్నారు. అయితే ఈ విషయం నిజమే అని రుజువు చేసేందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని, కనుక ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
అయితే కొందరు సైంటిస్టులు మాత్రం దీని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి చెబుతున్నారు. నారింజలను కాల్చడం అనేది అసాధారణ ప్రక్రియ. ఈ క్రమంలో అలాంటి కాల్చిన పండ్లను తినాలని కొందరికి మనస్సులో ఆసక్తిగా ఉంటుంది. దాంతో శరీరం షాక్‌కు గురైనట్లు అయి ఆ పండు టేస్ట్‌ను ఆస్వాదించాలని సెన్స్ ఇస్తుంది. అందులో భాగంగానే కొందరికి అలా ఆ పండ్లను తినడం వల్ల మళ్లీ రుచులు తెలుస్తుండవచ్చు.. అని పలువురు సైంటిస్టులు పేర్కొన్నారు. అయితే దీనిపై సైంటిస్టులు ప్రయోగాలు చేస్తారేమో చూడాలి.