పల్నాడులో టీడీపీ నేత హత్య.. వైసీపీ పనేనా ?

-

గుంటూరు జిల్లా పల్నాడు లో టిడిపి నేత హత్య కలకలం రేపుతోంది. నిన్న రాత్రి మాజీ సర్పంచ్ అయిన టీడీపీ నేత గొంతుకోసి చంపారు గుర్తు తెలియని దుండగులు. గురజాల నియోజకవర్గం లోని పెదగార్లపాడు సర్పంచ్ గా పురం శెట్టి అంకుల్ 15 ఏళ్ళపాటు సేవలందించారు. ఆయనకు ఎరపతినేని ముఖ్య అనుచరుడిగా కూడా పేరుంది. దాచేపల్లి లో ఆయన ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. ఆ అపార్ట్మెంట్ నిర్మాణం ప్రాంగణంలోని ఆయన్ని గొంతుకోసి హత్య చేశారు దుండగులు. అయితే వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందంటూ ఎరపతినేని ఆరోపణలు చేశారు.

హత్యానంతరం దుండగులు టిడిపి నేత ఫోన్ పట్టుకుని వెళ్ళి పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసులు ఆయన కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు. మరోపక్క తమ నేత హత్యకు నిరసనగా ఈ రోజు టిడిపి ఆందోళనకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించనున్నారు అని కూడా చెబుతున్నారు. ఆయన కుటుంసభ్యులు కూడా వైసీపీనే ఈ హత్యకు కారణం అని ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news