రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి భారీ మల్టీస్టారర్ గా చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు దాకా ఉండొచ్చని అంటున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో రాం చరణ్ పెట్టుబడుల గురించి వార్తలు వస్తున్నాయి.
కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ పూర్తిస్థాయి నిర్మాత అవతారమెత్తిన విషయం తెలిసిందే. అందుకే ఆర్.ఆర్.ఆర్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడట. అదెలా అంటే ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు దానయ్యే నిర్మాత.. ట్రిపుల్ ఆర్ కు ఆయనే. ఈ రెండు సినిమాలకు కలిపి 40 నుండి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకోవాల్సి ఉంది. అయితే అది తీసుకోకుండా ట్రిపుల్ ఆర్ బడ్జెట్ లో కలిపేశాడట చరణ్.
రాజమౌళి సినిమా కాబట్టి ఎలాగు లాభాలు వస్తాయి. ఆ లాభాల్లో వాటా ఇవ్వమని చెప్పాడట. ఆర్.ఆర్.ఆర్ చరణ్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడన్నమాట. ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవని ట్రిపుల్ ఆర్ పై ఇంకెన్ని సర్ ప్రైజ్ న్యూస్ వినాల్సి వస్తుందో చూడాలి.