
మిస్ యూనివర్స్ అంటే విశ్వ సుందరి… అంటే ఈ విశ్వానికే సుందరి అన్నమాట. ఈ విశ్వానికే అందంగా ఉన్నా అని తనకు తాను నిరూపించుకోవడం అంత ఈజీ కాదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఇది. అందుకే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల గురించి అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

తాజాగా జరిగిన మిస్ యూనివర్స్ 2018 పోటీల్లో ఫిలిప్పీన్స్ కు చెందిన క్యాట్రియోనా ఎలీసా గ్రే విజేతగా నిలిచింది. ఈ పోటీలు బ్యాంకాక్ లో జరిగాయి. మొదటి రన్నరప్ గా సౌత్ ఆఫ్రికాకు చెందిన తమారిన్ గ్రీన్ నిలవగా… రెండో రన్నరప్ గా వెనిజువెలాకు చెందిన స్టిఫెనీ గ్యూటెరెజ్ నిలిచింది. అయితే.. ఇండియాకు చెందిన 22 ఏళ్ల నేహల్ చూడాసమా కనీసం టాప్ 20 లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.

ఇక.. మిస్ యూనివర్స్ గా గెలిచిన ఎలీసా గ్రే స్పెషల్ గా డిజైన్ చేసిన రెడ్ కలర్ గౌన్ లో మెరిసిపోయింది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని 2017 మిస్ యూనివర్స్ డెమీలీ… క్యాట్రియోనాకు పెట్టింది.





