దేశవ్యాప్తంగా నేడు రెండో డ్రై రన్… అదే కారణం !

-

ఈ రోజు దేశ వ్యాప్తంగా రెండో దఫా కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో 736 జిల్లాలో ఈరోజు డ్రై రన్ కొనసాగనుంది. ఉత్తర ప్రదేశ్, హర్యానా మినహా మిగతా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు గాను ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.  ఈ నెల 2వ తేదీన తొలివిడతలో 125 జిల్లాలో డ్రై రన్ నిర్వహించారు. గతంలో తలెత్తిన లోపలన్నటినీ సరి చేసుకుని ఈ రెండో విడత డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆసుపత్రి, బ్లాక్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి డేటాను కేంద్రం సమీక్షించడం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రతి జిల్లలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ డ్రై రన్ జరగనుంది. అలానే కోల్డ్ చైన్ వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీకి మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అంతేగాక కరోనా కేసులు పెరుగుతున్న నాలుగు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, కేరళకు ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కట్టడి మీద దృష్టి సారించాలని సూచనలు చేస్తూ తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news