వారు చిరుతతో ఆటాడేశారు..!

-

ఓ చిరుత పులి జనసమూహంతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో అటవీ అధికారులు, నిపుణులను ఆందోళనలో పడేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తీర్థన్‌లోయ మీదుగా అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అక్కడ కాసేపు ఆగి సరదాగా సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాళ్లముందు ఓ చిరుత ప్రత్యేక్షమైంది. చిరుతను చూసిన అక్కడున్న ఐదారు మందికి ఒక్కసారిగా చెమలు పట్టాయి. ఇక ప్రాణాలు హరీ అనుకున్నారంతా. ఆ చిరుత గాండ్రిస్తూ మెల్లిమెల్లిగా వారి వద్దకు వెళ్తుండగా ఎలాగైన ప్రాణాలు దక్కిచుకోవాలని అందులో ఓ ముగ్గురు వ్యక్తులు మెల్లిగా తన వాహనాలవైపు అడుగులు వేశారు.

అక్కడున్న ఓ వ్యక్తి కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. అతని దగ్గరవకు వచ్చిన చిరుత ప్రేమగా అతడిని నెమురుతూ పెకి పాక్కుతూ చిలిపి చేష్టాలు చేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత చిరుతతో అక్కడున్న వారంతా సరదాగా ఆడుకున్నారు. చిరుతమాత్రం ఏ ఒక్కరికి హానీ చేయకుండా వారితో ఆడుకోసాగింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరస్‌ అయ్యింది. ఈ చిరుత యొక్క వింత ప్రవర్తనను ఇండియాన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ట్విటర్‌లో పోస్ట్‌చేయడంతో మరింత వైరల్‌ అయ్యింది. పెంపుడు పులి ఉండోచ్చని అందుకే అది మనుషుల ఉనికిని గ్రహించి వారికి హానీ కలిగించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి తప్పించుకుని వచ్చి ఉండొచ్చని పర్విన్‌ కస్వాన్‌ అనే ఓ అధికారి అభిప్రాయపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news