బిగ్ బాస్ విజేత అభిజిత్ కి అదిరిపోయే గిఫ్ట్… క్రికెటర్ రోహిత్ శర్మ నుండి.

-

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్లో విజేతగా నిలిచిన అభిజిత్ కి అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో కామ్ గా ఉంటూ, అందరి నుండి మెప్పు పొంది విజేతగా నిలిచిన తర్వాత అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా అభిజిత్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అది ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ నుండి కావడం విశేషం. అభిజిత్ కి రోహిత్ శర్మ నుండి గిఫ్ట్ రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? దానికి కారణం హనుమ విహారి.

హైదరాబాద్ కి చెందిన హనుమ విహారి, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అడుతున్నాడు. మూడవ టెస్టులో తన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐతే హనుమ విహారి, అభిజిత్ కి మంచి ఫ్రెండ్, అభిజిత్ కి రోహిత్ అంటే అభిమానం. అందువల్ల రోహిత్ శర్మ నుండి, అభిజిత్ కి గిఫ్ట్ వచ్చింది. తన జెర్సీపై సంతకం చేసి, అభిజిత్ అని పేరు రాసి మరీ పంపించాడు. మొత్తానికి అభిజిత్ కి మంచి బహుమతే వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news