మొబైల్స్ తయారీదారు ఒప్పో.. రెనో 5 ప్రొ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ 3డి బార్డర్‌లెస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ అద్భుతమైన ప్రదర్శనను ఇస్తుంది. 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ నానో కెమెరా, 2 మెగాపిక్సల్ మోనో కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫుల్ డైమెన్షన్ ఫ్యుషన్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. దీని వల్ల వీడియో క్వాలిటీ బాగుంటుంది.
ఈ ఫోన్‌కు గ్లాస్ బ్యాక్ కవర్ ఉంది. ఫింగర్ ప్రింట్, స్క్రాచ్ రెసిస్టెంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 4350 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 65 వాట్ల ఫ్లాష్ చార్జ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ కేవలం 30 నిమిషాల్లోనే 100 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది.
ఒప్పో రెనో 5 ప్రొ 5జి ఫీచర్లు…
* 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్
* 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి
* 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ
* 4350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జ్
ఒప్పో రెనో 5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.35,990గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 22వ తేదీ నుంచి విక్రయిస్తారు.