ఉత్తరేణి వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

-

ఉత్తరేణి వల్ల చాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం పై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకి కూడా ఉత్తరేణి తో చెక్ పెట్టవచ్చు. గాయం తగిలినప్పుడు రక్తం కారడం కూడా ఉత్తరేణి తో నిలపవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడే చూసేయండి. అలానే ఉపయోగించండి. సులువుగా ఎన్నో సమస్యలని తరిమేయొచ్చు. ఇక దీని వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి…? ఈ విషయానికి వస్తే… ఉత్తరేణి మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

గాయాలైనప్పుడు రక్తం నిలువకుండా కారుతుంటే, ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయం పైన పిండితే రక్తం కారడం నిలిచిపోతుంది. అలానే శరీరం పై దురద, పొక్కులు, పొట్టు రాలుతుంటే శరీరం పై ఉత్తరేణి ఆకుల రసాన్ని పోయడం వల్ల ఆ వ్యాధులన్నీ తగ్గుతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేలు కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకుల్ని మెత్తగా నూరి కుట్టిన చోట పెట్టడం వల్ల నొప్పి, దురద తగ్గుతాయి.

అంతే కాదండి పంటి నొప్పి ఎక్కువగా ఉంటె… ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటి పై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది మరియు చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదము తో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అవి తగ్గి పోతాయి. పొట్ట మీద కొవ్వు కరగాలంటే నువ్వుల నూనెలో ఉత్తరేణి ఆకుల రసాన్ని వేసి బాగా మరగనిచ్చి. దానిని పొట్ట మీద రాస్తే కొవ్వు కరిగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news