అన్నీ వదిలేసి ఎవ్వరూ లేని దీవికి వెళ్ళిపోవాలనుందా? ఐతే ఈ ఉద్యోగానికి అప్లై చేసేయండి..

-

ప్రపంచంలో ఉన్న బాధలన్నింటి నుండి విముక్తి పొందాలనుందా? చీటికీ మాటికీ చిరాకు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? ఈ బాధలన్నింటినీ మూటకట్టి ఎవ్వరూ లేని దీవికి పారిపోవాలనుందా? ఐతే మీకోసమే ఈ జాబ్. కనుల ముందు అందరూ కనిపించి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది. అది కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఇద్దరు మాత్రమే వెళితే మరింత బాగుంటుందని అనుకుంటూ ఉంటారు.

ఐతే సాధారణంగా ఇలాంటి కలలన్నీ ఫాంటసీలుగానే మిగిలిపోతాయి. కానీ ఆ ఫాంటసీ నిజమయ్యే అవకాశం వచ్చింది. అవును. సముద్ర పక్కన దీవిలో మీరూ, మీతో పాటు మీకు నచ్చిన వ్యక్తి. ఇద్దరు మాత్రమే ఉండి దీవిని చూసుకునే వ్యక్తుల కోసం ఐర్లాండ్ ఎదురుచూస్తుంది.

ఐర్లాండ్ లోని ఒకానొక దీవిని చూసుకునేందుకు కేర్ టేకర్స్ కావాలని ప్రకటించింది. ఆ దీవిలో ఉండే నాలుగు గెస్ట్ రూమ్ లని మేనేజ్ చేసుకుంటూ, ఆరు నెలలపాటు దీవిని కంటికి రెప్పలా కాపాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఐతే ఈ అవకాశం కొద్ది మందికి మాత్రమే. మొత్తం 40వేల మందిని మాత్రమే ఈ నోటిఫికేషన్ కి పిలుస్తుంది. అందులో నుండి కేవలం ఇద్దరినీ మాత్రమే సెలెక్ట్ చేయనుంది. ఆ ఇద్దరిలో ఒకరు మీరే అవకాశం కలదు. ఈ మేరకు ఆ దీవిని చూసుకునే సంస్థ, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది.

వాళ్ల వెబ్ సైట్ కి లాగిన్ అయ్యి, అక్కడ ఉన్న ప్రశ్నలకి జవాబులు చెబితే అందులో నుండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఐతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే,

అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కరెంట్ కూడా లేదు. తాగడానికి నీళ్ళు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి ఇవన్నీ చూసుకుని మీకు నచ్చితే జాబ్ కి అప్లై చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news