మూఢ నమ్మకమే వీరి పాలిట శాపంగా..!

-

చిత్తూరు: ఉన్నత విద్యావంతులే మూఢ నమ్మకానికి బలయ్యారు. ఓ వైపు తండ్రి.. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా కొనసాగుతుంటే.. మరో వైపు అతడి భార్య మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ కరస్పాండెంట్ గా ఉన్నారు. 25 సంవత్సరాలు విద్యాబోధనలు అందిస్తూ సమాజంలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇద్దరు కూమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారం రోజుల కిందట జరిగిన పరిణామాలే వారి ఇంట శాపంగా మారింది.

purushottam family

చిన్న కుమార్తెతో..
చిన్న కుమార్తెతో మొదలైన భయం ఇంటిల్లిపాదిని మూఢనమ్మకంలో నెట్టేసింది. విజ్ఞానవంతులైన వీరే విచక్షణా రాహిత్యాన్ని కోల్పోయి కన్న బిడ్డలనే కొట్టి చంపేలా చేసింది. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్ ఆదివారం రాత్రి జరిగిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల జంట హత్యల కేసు.. మరుసటి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం..
పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు. 25 ఏళ్లుగా శివనగర్ లో నివసిస్తున్నారు. వీరి కుమార్తెలు అలేఖ్య (27), సాయిదివ్య (22). ఈ నలుగురు ఇంట్లో తరచూ ఆధ్యాత్మిక విషయాలపైనే చర్చించుకునేవారు. ఏ చిన్న పని నుంచి బయట పడినా అది దేవుడి వల్లే జరిగిందని భావించేవాళ్లు. పద్మజ ఫేస్ బుక్ లో కూడా ఆధ్యాత్మిక పోస్టులే పెట్టేది. పురుషోత్తం కూడా ఆధ్యాత్మిక, తాంత్రిక పుస్తకాలనే చదివేవారు.

వారం రోజుల కిందట అలేఖ్య, సాయిదివ్య పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్ కు వెళ్లారు. రోడ్డు మధ్యలో అనుకోకుండా ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమను తొక్కారు. ఈ విషయాన్ని తిరిగి వచ్చాక తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో తమకు ఏమైనా అవుతుందోననే భయం ఆ ఇద్దరు యువతుల్లో మొదలైంది. అప్పటి నుంచి ఇంట్లో సాయిదివ్య ఇంట్లో దెయ్యాలున్నాయని, అలేఖ్య మౌనం పాటించేది. అలా వీరిలో తమకు ఏమైనా అవుతుందోనని భయం.. మూఢనమ్మకం నాటుకుపోయింది. దీంతో వారు తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని సంప్రదించారు. మంత్రగాడు ఇచ్చిన తాయిత్తును కూడా కట్టుకున్నారు.

alekhya- sai divya

రోజంతా పూజలు.. అనుకోకుండా..
వారం రోజులుగా పురుషోత్తం నాయుడు, పద్మజ విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. రోజంతా పూజల్లో నిమగ్నమయ్యేవారు. అనుకోకుండా ఆదివారం తమ ఇంటి పై అంతస్తులో ఉన్న సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ గట్టిగా అరిచింది. మానసిక రోగిలా.. పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడంలో ముగ్గురు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి డంబెల్ తో గట్టిగా తలపై బాదారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత అలేఖ్య తన చెల్లెలి నుడిటిపై ముగ్గు వేసి తన ఆత్మను బంధించానని చెప్పింది. చెల్లెలిని బతికించుకుని తెచ్చేందుకుకు తననూ చంపాలని తల్లిని కోరింది. దీంతో ఆదివారం రోజు రాత్రి ముగ్గురు నగ్నంగా ఇంట్లో క్షుద్ర పూజలు చేశారు. అలేఖ్యను పూజ గదిలో తీసుకెళ్లి నోట్లో రాగి కలశాన్ని పెట్టి.. అందులో నవధాన్యాలు పోసి.. కలశంతో పొడిచి చంపారు. దీంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత ఇద్దరి మొబైల్ ఫోన్లను ఆ దంపతులు పగులగొట్టేశారు.

జరిగిన ఉదంతాన్ని పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి తెలియజేశాడు. దీంతో ఆయన అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో చూస్తే ఇద్దరి మృతదేహాలు రక్తపు మడుగుల్లో కనిపించాయి. దీంతో ఆయన మదనపల్లె డీఎస్పీ రవిమనోహర చారిని సంప్రదించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మరుసటి రోజు (సోమవారం) పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news