మీరు వాడుతున్న సబ్బు సరైనదేనా? దాని పీహెచ్ వాల్యూ గురించి మీకు తెలుసా..?

-

స్నానం చేసేటపుడు వాడే సబ్బు మీ చర్మంపై చాలా ప్రభావం చూపిస్తుంది. మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, మీ చర్మానికి సూట్ కాకపోయినా వాడుతున్నారంటే మీ చర్మాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే. అందుకే మీకు నచ్చింది కాకుండా మీ చర్మానికి ఏ సబ్బు సూట్ అవుతుందో తెలుసుకోండి. సబ్బులో ముఖ్యంగా అందరూ గమనించేది పీహెచ్ విలువ. పీహెచ్ విలువ ఎక్కువగా ఉన్న సబ్బుల వల్ల చర్మం పొడిగా మారుతుంది. దానివల్ల వ్యసు పెరిగినట్లుగా కనిపించడమే కాకుండా అనేక ఇతర చర్మ సమస్యలు వస్తుంటాయి.

పీహెచ్ విలువ అంటే,

పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఆరోగ్యమైన చర్మానికి ఈ పీహెచ్ విలువ 5.3 నుండి 5.4 వరకు ఉంటుంది. ఈ పీహెచ్ విలువని మీరు వాడుతున్న సబ్బు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. పీహెచ్ విలువ మరీ ఎక్కువగా ఉంటే వాటిని ఆల్కలైన్ అంటారు. మరీ తక్కువగా ఉంటే ఆసిడ్ అంటారు.

ఆల్కలైన్ సబ్బులు వాడితే చర్మం పొడిబారిపోతుంది. చర్మంలో ఉన్న తేమ మాయమైపోతుంది. అలాగే ఆసిడ్ సబ్బులని వాడితే ఇతర చర్మ సమస్యలు వస్తాయి. అందుకే మీ చర్మ పీహెచ్ విలువని సరిగ్గా మెయింటైన్ చేసే సబ్బులని వాడడం ఉత్తమం. మీరు స్నానం చేసిన తర్వాత మీ చర్మం పొడిగా కనిపించిందంటే ఆ సబ్బు మీకు సరైనది కాదని అర్థం. అయినా సరే వాడుతున్నారంటే కోరి కోరి ఇబ్బందులు తెచ్చుకుంటున్నట్టే.

పీహెచ్ వాల్స్యూని సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి.

స్నానం ఎక్కువ సేపు చేయకూడదు. అదీ వేడినీటితో ఎక్కువ సేపు స్నానం అస్సలు మంచిది కాదు. అలాగే సబ్బుని మరీ ఎక్కువగా వాడకూడదు. అతిగా వాడితే అనర్థాలు తప్పవు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని సబ్బుని ఎంచుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news