మోదీ ప్రభుత్వం రైతులకి శుభవార్త చెప్పనుంది. ఈసారి బడ్జెట్ లో రైతులకు వరాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొత్త బడ్జెట్ ని తీసుకొస్తున్నట్టు తెలిసినదే. అయితే ఈ బడ్జెట్ లో రైతులకి మంచి ఆఫర్ ఇచ్చే లాగ కనపడుతోంది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ పై చాలా అంచనాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…? కరోనా నుండి పరిస్థితులు కోల్కొనేలా ఈ బడ్జెట్ ని రూపొందించాలి.
ఢిల్లీ లో రైతులు గత కొన్ని నెలల నుండి రైతుల ధర్నా చేస్తున్నారు. అలానే రైతులు ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ చేస్తున్న సంగతి కూడా తెలిసినదే. అయితే కేంద్ర ప్రభుత్వం వీరికి కూడా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంది. అయితే వీటిని అన్నింటిని పరిగణ లోకి తీసుకుని ఈ బడ్జెట్ ప్లాన్ లో రైతులని ఆదుకునేలా రూపొందించేలా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు ప్రసన్నం చేసుకోవడానికి బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.
పీఎం కిసాన్ స్కీమ్ మాత్రమే కాకుండా సోలార్ పంపు స్కీమ్ పొడిగింపు కూడా ఉండొచ్చని అందరూ ఆశిస్తున్నారు. అయితే వీటి కోసం పూర్తిగా తెలియాలి అంటే బడ్జెట్ ప్లాన్ ని ప్రవేశం పెట్టె వరకు తెలియదు. ఇది ఇలా ఉంటె రెన్యూవబుల్ మినిస్ట్రీ పీఎం కుసుమ్ స్కీమ్ కోసం 20 నుంచి 25 శాతం ఎక్కువ నిధుల కేటాయింపు ప్రతిపాదించింది. అంతే కాదు క్రాప్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ఈసారి రావొచ్చు అని అంటున్నారు. ఇది కనుక వస్తే… ఎకరాకు రూ.7 వేల ఆర్థిక సాయం అందుతుంది.