ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అయితే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించడంతో అది వివాదంగా మారింది. దీని మీద అధికార వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసిపి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం టిడిపికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా ఈ నోటీసులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం తప్పేమీ కాదని ఆయన అన్నారు.
ఆర్టికల్ 73 ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకి కచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతామని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం ఏమీ శాశ్వతం కాదన్న ఆయన జమిలీ వస్తే వైసీపీ సర్కార్ ఉండదు అని అన్నారు.అలాగే అసలు ముందు నుంచి ఎన్నికలు వద్దు అన్న వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో మీద ఎలా ఫిర్యాదు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇక వైసిపి మంత్రులు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు చెల్లుబాటు కావాలని ఆయన అన్నారు.