ఏపీలో రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్

-

ఏపీలో రేపటి నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కానుందని  వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రెండో దశలో రెవెన్యూ, పోలీస్,  పంచాయతీ, మున్సిపల్ శాఖలకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేయించుకున్నారన్న ఆయన వ్యాక్సిన్ విషయంలో కొన్ని అపోహలు అననమానాలు ఉన్నాయి అని అన్నారు.

vaccine
vaccine

ఆ అనుమానాలను అన్నీ నివృత్తి చేస్తున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణ చేస్తూనే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గుంటూరు జీజీహెచ్ వర్కర్ మరణం వ్యాక్సిన్ కారణమా..? లేదా..? అనేది ఇంకా తేలలేదన్న ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని అన్నారు. ఇక ఎన్నికల ప్రక్రియతో పాటు వ్యాక్సిన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉండడంతో ఈ సారి ఈ తతంగం ఎలా సాగుతుందా ? అనే అనుమానాలు అయితే అందరిలోనూ ఉన్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news