దేశ వ్యాప్తంగా ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ రాష్ట్ర రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. కరీంనగర్ లోని ప్రతిమ వైద్య కళాశాలలో నిర్మించిన వివిధ యూనిట్లు, ఆడిటోరియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..వైద్య రంగంలో దేశం అభివృద్ధి సాధించినా చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందని కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారు, ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి సరైన వైద్యం అందడం లేదన్నారు. ప్రపంచంలోనే తలసేమియా బాధితుల విషయంలో మనం మొదటిస్థానంలో ఉన్నామన్నారు. పట్టణాల్లోని వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు . కేంద్రం ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఉద్దేశించి ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని, దీనివల్ల లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందుతుందని రాష్ట్రపతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంపై అవగాహన పెంచాలి..రాష్ట్ర పతి
-